రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-21T05:52:02+05:30 IST

సహకార సంఘాల ద్వారా అందించే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ రైతులకు సూచించారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, జూన్‌ 20 : సహకార సంఘాల ద్వారా అందించే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ రైతులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యర్రవరం పీఏసీఎస్‌ పాలకవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు గ్రామాల్లో చిరువ్యాపారం చేసేవారికి రుణాలు అందించాలని పాలకవర్గానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ముందుకుపోతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నలజాల శ్రీనివాసరావు, ఎంపీపీ కవితారెడ్డి, కొండ సైదయ్య, వీరపల్లి వెంకటసుబ్బయ్య, ఉద్దండు, యడ్లపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T05:52:02+05:30 IST