పులిచింతల వద్ద భారీ పోలీసు బందోబస్తు
ABN , First Publish Date - 2021-06-30T18:33:42+05:30 IST
పులిచింతల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
సూర్యాపేట: కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టీఎస్ జెన్కో వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. ప్రాజెక్ట్ సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను టీఎస్ జెన్కో ప్రారంభించింది. మొదటి యూనిట్ ద్వారా 16.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి 1500 క్యూసెక్కుల నీటిని వినియోగించి... దిగువకు విడుదల చేయనున్నారు.