సూర్యాపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-02-01T15:07:56+05:30 IST

జిల్లాలోని చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ క్రాస్ రోడ్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సూర్యాపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ క్రాస్ రోడ్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తుమ్మలపెన్ పహడ్ గ్రామానికి చెందిన పిడమర్తి నవీన్ (24)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-02-01T15:07:56+05:30 IST