సర్వేను పడక్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
ABN , First Publish Date - 2021-05-20T06:04:21+05:30 IST
ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు.

నాగారం / అర్వపల్లి, మే 19 : ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. బుధవారం నాగారం, అర్వపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఇంటింటి సర్వే తీరును ఆమె పరిశీలించారు. కరోనా రెండోదశ ఉధృతి నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం సర్వేను చేపట్టిందన్నారు. నాగారం పీహెచ్‌సీని తనిఖీ చేసి కరోనా నిర్ధారణ పరీక్షల నమోదు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీవో జి.శోభారాణి, దార శ్రీనివాస్, డాక్టర్ రామకృష్ణ, కురం వెంకన్న, సురేష్, శేఖర్‌రావు ఉన్నారు. అర్వపల్లి మండలంలో అదనపు కలెక్టర్ వెంట జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, సర్పంచ్ సునీతారామలింగయ్య, ఆశా, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
లక్షణాలు ఉంటే కిట్లు అందజేయాలి : డీపీవో
మునగాల / నడిగూడెం / మేళ్లచెర్వు / పెన్‌పహాడ్ / మఠంపల్లి : ఇంటింటి సర్వేలో గుర్తించిన కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేయాలని డీపీవో యాదయ్య అన్నారు. మునగాలలో సర్వేను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. అదేవిధంగా నడిగూడెం మండలం బృందావనపురంలో సర్వేను తహసీల్దార్ ఎన్.ఆనందబాబు పరిశీలించారు. మేళ్లచెర్వు మండల కేంద్రంలో సర్వేను సర్పంచ్ శంకర్‌రెడ్డి పరిశీలించారు. పెన్‌పహాడ్ మండలం నాగులపాటిఅన్నారంలో తహసీల్దార్ శేషగిరిరావు సర్వేను ప్రారంభించి, మాట్లాడారు. ఆయన వెంట ఆర్‌ఐ మట్టయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. మఠంపల్లి మండలం కాల్వపల్లితండా, దొనబండతండా, మఠంపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వేను ఎంపీడీవో మామిడిజానకిరాములు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో నరే్‌ష,మాజీ ఎంపీటీసీ బాలనాయక్, కార్యదర్శులు పాల్గొన్నారు.