గంజాయి రవాణాపై నిఘా : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-10-14T06:16:28+05:30 IST

గంజాయి రవాణాపై గట్టి నిఘా ఉంచినట్లు డీఎస్పీ రఘు తెలిపారు. పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గంజాయి రవాణాపై నిఘా : డీఎస్పీ

హుజూర్‌నగర్‌, అక్టోబరు 13: గంజాయి రవాణాపై గట్టి నిఘా ఉంచినట్లు డీఎస్పీ రఘు తెలిపారు. పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. హుజూర్‌నగర్‌కు చెం దిన బీటెక్‌ విద్యార్థులు గంజాయి రవాణా కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. విశాఖ జిల్లా నుంచి ఫారెస్ట్‌ రేంజర్‌ డ్రైవర్‌ సహాయంతో సూర్యాపేట జిల్లాకు అక్రమ రవాణా జరుగుతోందన్నారు. డివిజన్‌ పరిధిలో ప్రతిరోజూ మూడు కేసులు నమోదు అవుతున్నాయన్నారు. గంజాయి రవా ణాతో పాటు వాటిని సేవించే వారిపై నిఘా పెట్టడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించామన్నారు. మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దన్నారు. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో పోలీసులు మఫ్టీలో తిరిగి నిందితులను పట్టుకుంటున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-14T06:16:28+05:30 IST