స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-10-19T05:58:28+05:30 IST

ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయమని డిఎస్పీ రఘు అన్నారు.

స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం: డీఎస్పీ

కోదాడ రూరల్‌, అక్టోబర్‌ 18: ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయమని డిఎస్పీ రఘు అన్నారు. రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న యలగొండ నాగేశ్వరరావు కరోనాతో మృతి చెందగా,  2011 బ్యాచ్‌ కానిస్టేబుళ్లు కలిసి రూ.5లక్షలతో కొనుగోలు చేసిన 111 గజాల ప్లాటు కాగితాలను సోమవారం నాగేశ్వరరావు భార్యకు అందజేశారు. పోలీస్‌ వ్యవస్థ ఒక కుటుంబమని, ఆపదలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదుకోవడం అందరిలో సహకార గుణాన్ని, అనుబంధాన్ని పెంచుతుందన్నారు. 2011 బ్యాచ్‌ కానిస్టేబుళ్లను ఆదర్శంగా తీసుకుని ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు శివరాంరెడ్డి, నరసింహారావు, ఎస్‌ఐలు సైదులుగౌడ్‌, సత్యనారాయణ గౌడ్‌, కానిస్టేబుళ్ళు ప్రవీణ్‌, రాజేష్‌, సతీష్‌, తిరపయ్య, ఫరీద్‌, అందె శ్రీను, కొండలు, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:58:28+05:30 IST