లాక్‌డౌన్ సమయంలో ఆదుకోవడం అభినందనీయం
ABN , First Publish Date - 2021-05-21T06:51:17+05:30 IST
జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు, కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కరోనాపై అవగాహన కల్పిస్తూనే వితరణలు చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు, కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కరోనాపై అవగాహన కల్పిస్తూనే వితరణలు చేస్తున్నారు.
హాలియా : హాలియాలో నరేష్ గోల్డ్ వర్క్స్ ఆధ్వర్యంలో సీఐ వీరరాఘవులు కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శివకుమార్, గోల్డ్ వర్క్స్ యజమానులు పాల్గొన్నారు.
దేవరకొండలో యుగతులసి ఫౌండేషన్, శివదీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి అంతరించిపోవాలని గోధూప హోమం నిర్వహించారు. హోమ పొగతో కరోనాను అరికట్టవచ్చునన్నారు. కార్య క్రమంలో నిర్వాహకులు కృష్ణమూర్తిశర్మ, యుగతులసి సభ్యులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొడ్డు గోపాల్ శానిటైజర్లను ఆర్డీవో గోపిరాంకు అందజేశారు. కార్యక్రమంలో నేనావత్ శీనునాయక్, నల్లగాసు సైదులుయాదవ్, మల్లేష్, అబ్బాస్ పాల్గొన్నారు.
మర్రిగూడ మండలం కుదాబాక్షుపల్లి గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి పిచికారీ చేశారు. అనంతరం పందుల కృష్ణయ్య ఇటీవల కరోనాతో మృతి చెందగా ఆయన కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు.ఆయన వెంట సర్పంచ్ సుధాకర్, సైదులు, పాండు ఉన్నారు.
చందంపేట, మండలం బొల్లారం గ్రామపంచాయతీలో 9 కొవిడ్ బాధితులకు మందికి మెడికల్ కిట్లను సర్పంచ్ చంద్రబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యకార్యకర్తలు,వార్డుమెంబర్లు పాల్గొన్నారు.
దామరచర్ల మండలం కేతావత్‌తండాలో కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి ఆడావత్ సైదులునాయక్ అందజేసిన మాస్క్‌లను డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతావత్ సైదమ్మ, సీతారాంనాయక్, మాతృనాయక్, నాగేందర్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో కరోనా బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యూత్ కాం గ్రెస్ ఆధ్వర్యంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్‌ఆర్ పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, బాలు, శేఖర్‌రెడ్డి, అనీల్, సాజిద్‌ఖాన్ పాల్గొన్నారు.
తెలంగాణ విద్యార్థి సంఘం ఆఽధ్వర్యంలో తిరుమలగిరి అంజి కరోనా బాధితుల అటెండెంట్లకు, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో బోయిన ఉపేందర్, వంశీ, నాగరాజు, కాశీ పాల్గొన్నారు.
హోం ఐసోలేషన్‌లోని బాధితులకు మేము సైతం సంస్థ సభ్యులు పండ్లు, డ్రైఫ్రూట్స్, ఆహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కీర్తి అశోక్, సోమగాని శ్రీనివాస్, సరస్వతి వేణు పాల్గొన్నారు.
రజక విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఇరు కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.
గుర్రంపోడు మండలం కొప్పోల్‌లోని ఐసోలేషన్ కేంద్రానికి నల్లగొండ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌కు చెందిన సురే్‌షగుప్తా 5 జతల పీపీఈ కిట్లు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, తేలుకుంట్ల రవి తదితరులున్నారు.
నల్లగొండలో సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మరబోయిన కేశవులు మునిసిపల్ కార్మికులకు నగదు, మాస్కులు అందజేసి, శాలువాతో సత్కరించారు.
పెద్దవూరలో హోంఐసోలేషన్‌లో ఉన్న కుటుంబాలకు సర్పంచ్ చామకూరి లింగారెడ్డి, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మిముత్యాల్‌రెడ్డి సొంత ఖర్చులతో కూరగాయలు, పండ్లు ఆశా వర్కర్ల అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముస్కు నారాయణ, పంచాయితి కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
మునుగోడు మండలం రావిగూడెంలోని పలు వీధుల వెంట హైపోక్లోరైడ్ ద్రావణాన్ని సర్పంచ్‌ల ఫో రం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం పిచికారీ చేశారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వెంకటయ్య, యాదయ్య, యాదయ్య, పరమేష్ పాల్గొన్నారు.
పెద్దవూర మండలం వెల్మగూడెం సర్పంచ్ రావుల శ్రీనువా్‌సయాదవ్ ప్రధాన వీధులలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆయనతో పాటు ఉపసర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.
కిడ్డి బ్యాంక్ డబ్బులతో అన్నదానం
వేములపల్లి : తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్ముతో మండల కేంద్రంలో కొవిడ్ విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ వారియర్స్‌కు భోజనాలు ఏర్పాటు చేశాడో చిన్నారి. మండల కేంద్రానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుట్టల భాస్కర్ కుమారుడు వాసుదేవ్ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను కిడ్డీ బ్యాంకులో జమ చేసుకునేవాడు. కొవిడ్ విధుల్లో ఉన్న వైద్య, పారిశుధ్య కార్మికులకు గురువారం కిడ్డీ బ్యాంకు నుంచి సొమ్మును వెచ్చించి భోజనాలు అందించారు. ఈ సందర్భంగా చిన్నారి వితరణను పలువురు అభినందించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ముస్తక్‌అహ్మద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.