శివలింగంపై సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2021-11-09T07:02:25+05:30 IST

మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని శివాలయంలో శివలింగంపై సూర్యకిరణాలు పడి కనువిందు చేస్తున్నాయి. 11 శతాబ్దాల క్రితం నాటి శివలింగాన్ని దశాబ్దం క్రితం పునర్మిర్మాణం చేసి ప్రతిష్ఠించారు.

శివలింగంపై సూర్యకిరణాలు
బూరుగడ్డలో శివలింగంపై పడుతున్న సూర్యకిరణాలు

హుజూర్‌నగర్‌,  నవంబరు 8: మండలంలోని  బూరుగడ్డ గ్రామంలోని శివాలయంలో శివలింగంపై సూర్యకిరణాలు పడి కనువిందు చేస్తున్నాయి. 11 శతాబ్దాల క్రితం నాటి శివలింగాన్ని దశాబ్దం క్రితం పునర్మిర్మాణం చేసి ప్రతిష్ఠించారు. కార్తీకమాసం మొదలైన ఐదో తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు వరసగా శివలింగంపై భానుడి కిరణాలు ప్రసరిస్తున్నాయి. నాగులచవితి సందర్భంగా సోమవారం కూడా సూర్యకిరణాలు పడడంతో భక్తులు ఉదయం 6.30 గంటల నుంచి ఏడు గంటల వరకు తరలివచ్చి సూర్య కిరణాలను తిలకించి ఆధ్యాత్మిక భావనతో తన్మయత్వం చెందారు.


Updated Date - 2021-11-09T07:02:25+05:30 IST