మోత్కూరులో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-29T06:53:12+05:30 IST

మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని అన్నెపువాడకు చెందిన అన్నెపు నవీన (22) గురువారం సాయంత్రం ఉ రి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మోత్కూరులో యువకుడి ఆత్మహత్య

మోత్కూరు, అక్టోబరు 28: మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని అన్నెపువాడకు చెందిన అన్నెపు నవీన (22) గురువారం సాయంత్రం ఉ రి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీవాసుల కథనం ప్రకారం... పట్టణంలోని ఓ వైనషాపులో పనిచేసే నవీన అనారోగ్య సమస్యతో కొద్ది రోజుల క్రితం మానేశాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. రెండేళ్ల క్రి తం మేనత్త కూతురు లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య, ఇతర కుటుంబ సభ్యులతో ఎలాంటి వివాదాలు లేవు. గురువారం భార్య, తల్లి కూలీ పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి నవీన ఉరి వేసుకుని మృతి చెందాడు. అనారోగ్య సమస్య కారణంగానే ఆత్మహత్య చే సుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 


Updated Date - 2021-10-29T06:53:12+05:30 IST