ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-07T06:35:03+05:30 IST

కు టుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఉ రి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో చో టు చేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
రమేష్‌ మృతదేహం

బొమ్మలరామారం, డిసెంబరు 6: కు టుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఉ రి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో చో టు చేసుకుంది. హాజీపూర్‌ గ్రామానికి చెందిన కొలిపాక రమేష్‌ (50) కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. 15 సంవత్సరాల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. దీంతో అప్పటి నుంచి రమేష్‌ ఏ పని చేయలేక కుటుంబ స భ్యులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. సోమ వారం తెల్లవారుజామున అదే గ్రా మానికి చెందిన రామిడి దశ్వంతరెడ్డి పశువుల కొట్టం వద్ద తాడుతో ఉరి వేసుకొ ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రమేష్‌ భార్య సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ వెం కన్న తెలిపారు. 


Updated Date - 2021-12-07T06:35:03+05:30 IST