పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-10T06:56:20+05:30 IST

కులం పేరుతో దూషించిన వారిపై ఫిర్యాదుపై విచారణ జరపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

మిర్యాలగూడ అర్బన్‌, ఆగస్టు 9: కులం పేరుతో దూషించిన వారిపై ఫిర్యాదుపై విచారణ జరపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గ్యార సాయికుమార్‌ ఇందిర మ్మకాలనీకి చెందిన యువతిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి ఘర్షణ జరిగింది. విషయం తె లుసుకున్న యువతి కుటుంబసభ్యులు పెద్దమనుషుల సమక్షంలో పంచా యితీ పెట్టారు. సాయికుమార్‌తోపాటు అతని తల్లిని కులం పేరుతో దూషిం చారని ఆరోపించారు. తమ బంధువుల మధ్య జరిగిన అవమానాన్ని తట్టు కోలేక తమను దూషించిన యువతి తల్లిదండ్రులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని సాయి కుమార్‌ పోలీసులను కోరగా నిర్లక్ష్యంగా వ్యహరించడంతో మనస్థాపం చెంది పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి పడిపోయాడు. అపస్మారకస్థితిలో పడిఉన్న బాధితుడిని గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువ కుడికి డాక్టర్లు  సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట జరిగిన ఆత్మహత్యాయత్న ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-08-10T06:56:20+05:30 IST