కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

ABN , First Publish Date - 2021-12-07T07:04:49+05:30 IST

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చందంపేట మండల పీఏసీఎస్‌ చైర్మన్‌ జాల నర్సింహారెడ్డి అన్నారు.

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

చందంపేట, డిసెంబరు 6:  విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చందంపేట మండల పీఏసీఎస్‌ చైర్మన్‌ జాల నర్సింహారెడ్డి అన్నారు. చందంపేట మండలం చిత్రియాల జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రతరంగా ఉండడంతో సొంత నిధులతో ముగ్గురు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించి, విద్యనందించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్రియాల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులకుగాను 90 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా ప్రధానోపాధ్యాయులతోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులే విద్యా బోధన చేస్తున్నారని తెలిపారు.  ఉపాధ్యాయ పోస్టులు ఐదు ఖాళీగా, విద్యా బోధన సక్రమంగా జరగడంలేదని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా గ్రామానికి చెందిన జాల నర్సింహారెడ్డి ఎంఈవో సామ్యనాయక్‌తో మాట్లాడి ముగ్గురు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించి వారికి సొంతంగా వేతనం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో సామ్యనాయక్‌, సర్పంచ్‌ రంగయ్యగౌడ్‌లు స్థానికులు నర్సింహరెడ్డిని అభినందించారు. 

Updated Date - 2021-12-07T07:04:49+05:30 IST