విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-21T05:32:31+05:30 IST

విద్యార్థులు చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు కోరారు.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కాలి వేళ్ల మధ్య పెన్నుతో బొమ్మ వేస్తున్న కీర్తన

మఠంపల్లి / నడిగూడెం /  సూర్యాపేట రూరల్‌, మార్చి 20 : విద్యార్థులు చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు కోరారు. మఠంపల్లి, నడిగూడెం, సూర్యాపేట మండలం ఇమాంపేటలో జరిగిన టీచింగ్‌ లెర్నింగ్‌పై విద్యార్థుల ఫొటో, ప్రయోగాల ప్రదర్శనను శనివారం ఆయా పాఠశాలలో ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మఠంపల్లి సర్పంచ్‌ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి, ప్రిన్సిపాల్‌ వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నడిగూడెంలో ఎంఈవో ఎండీ సలీంషరీ్‌ఫ్‌, ఎంపీడీవో శాంతకుమారి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ధన విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇమాంపేటలో సర్పంచ్‌ పాముల ఉపేందర్‌, టీచర్లు పాల్గొన్నారు. 


కీర్తనకు మొదటి బహుమతి

 నడిగూడెం ఫొటో ఎగ్జిబిషన్‌లో దుగ్గపాటి కీర్తన గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. రెండేళ్ల కిందట విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన కీర్తన కృత్రిమ చేతులతో 8వ తరగతి చదువుతోంది. చేతుల సహకరించకపోయినా కాలివేళ్ల మధ్య పెన్నుతో గీసిన చిత్రాలను చూసి అభినందించిన ఎంఈవో సలీంషరీఫ్‌ మొదటి బహుమతి అందించి ప్రోత్సహించారు. 


Updated Date - 2021-03-21T05:32:31+05:30 IST