విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ABN , First Publish Date - 2021-08-28T04:57:16+05:30 IST

: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంపీపీ కవితారెడ్డి అన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఎంపీపీ కవితారెడ్డి

కోదాడటౌన్‌, ఆగస్టు 27 : విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంపీపీ కవితారెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో శ్రీ చాణిక్య అకాడమీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ అభాస్కస్‌ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేసి మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపడం పట్టణానికే గర్వాకారణమన్నారు. కార్యక్రమంలో నిశాంత్‌, కిరణ్‌శ్రీరామ్‌, యశ్వంత్‌రెడ్డి, హేమసునంద, ఆదిత్య, వనపర్తి లక్ష్మినారాయణ, డాక్టర్‌ కొత్తపల్లి సురేష్‌, చాణక్య అకాడమీ ప్రిన్సిపల్‌ చంద్రిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T04:57:16+05:30 IST