సైబర్‌ క్రైమ్‌ నివారణకు పటిష్ఠ చర్యలు

ABN , First Publish Date - 2021-08-20T06:10:15+05:30 IST

సైబర్‌ నేరాలను మరింత సమర్ధంగా అరికట్టేందుకు పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తెలిపారు.

సైబర్‌ క్రైమ్‌ నివారణకు పటిష్ఠ చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంగనాథ్‌

సైబర్‌ క్రైమ్‌ నివారణకు పటిష్ఠ చర్యలు
ఫిర్యాదుకు డయల్‌ 100తో అనుసంధానం
నల్లగొండ ఎస్పీ ఏవీ.రంగనాథ్‌

నల్లగొండ క్రైం, ఆగస్టు 19 :
సైబర్‌ నేరాలను మరింత సమర్ధంగా అరికట్టేందుకు పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు  నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తెలిపారు. గురువారం ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులు, రైటర్లు, సీసీ టీఎనఎ్‌స ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సైబర్‌ క్రైమ్‌ కేసులను త్వరగా  పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. సైబర్‌ క్రైం బాధితులు నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌తో నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనిపై అవగాహన లేని వారు టోల్‌ఫ్రీ నెంబరు 155260నెంబరుకు ఫోన చేసి వివరాలు వెల్లడిస్తే పోర్టల్‌లో నమోదు చేస్తారని, డయల్‌ 100కు ఫోన చేస్తే పోలీస్‌ సిబ్బంది వాటిని నమోదు చేసుకొని ఎనసీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తారన్నారు. దీంతో సంబంధిత పీఎ్‌సలతో బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో నగదు బదిలీలను నిలిపివేయడం జరుగుతుందన్నారు.  ఓటీపీల పేరుతో ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ నకిలీ ఐడీల రూపంలో, మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపి ఆ లింక్‌ క్లిక్‌ చేయడంతో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, మల్టీలెవల్‌ మార్కెటింగ్స్‌, ఉద్యోగాల కల్పన పేరుతో జరుగుతున్న మోసాలలాంటి అనేక రకాల సైబర్‌ నేరాలు జరుగుతున్న క్రమంలో బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కాకుండా నివారించే అవకాశం ఉందన్నారు. దీనిపై విస్తృత అవగాహన కోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారానికి  చర్యలు తీసుకున్నామన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్లలో ఎంతోకాలంగా ఉన్న, సీజ్‌చేసిన, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్లియర్‌ చేయడంలో అన్ని రకాల నిబంధనలు పాటించాలన్నారు. వాహన యజమానులను గుర్తించి, ఇంజన నెంబర్లు, ఛాసిస్‌ నెంబర్ల ఆధారంగా ఆర్‌టీఏ కార్యాలయం నుంచి ఆయా చిరునామాలను సేకరించి వారం వ్యవధిలో మూడు నోటీసులు జారీ చేయాలన్నారు. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఉన్న వాహనాలను గుర్తించి వాటిని పక్కన ఉంచాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీంతో  కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు పనితీరులో నైపుణ్యం పెరుగుతుందన్నారు. జిల్లాలో ప్రతీ శనివారం అన్ని పీఎ్‌సల పరిధిలోని సి బ్బందికి పోలీ్‌సశాఖ అమలు చేస్తున్న అన్ని అంశాలు, సాంకేతిక పరిజ్ఞానంపై నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వర్టికల్స్‌ అమలు తీరును సమీక్షించారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మొగిలయ్య, సీఐలు గోపి, పీఎనడీ ప్రసాద్‌, చంద్రశేఖర్‌రెడ్డి, దుబ్బ అనిల్‌, శంకర్‌రెడ్డి, గౌరునాయుడు, రవీందర్‌, రాజశేఖర్‌, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T06:10:15+05:30 IST