మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-10-29T06:15:00+05:30 IST

మత్స్యకార్మికుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్న పూర్ణ అన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతికి  రాష్ట్ర ప్రభుత్వం కృషి
మత్స్యకారులకు చేప పిల్లలను అందజేస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ

సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 28: మత్స్యకార్మికుల అభ్యున్నతికి రాష్ట్ర  ప్రభుత్వం కృషి చేస్తోందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్న పూర్ణ  అన్నారు.  గాంధీనగర్‌, దాసాయిగూడెం గ్రామ చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేపలను సూర్యాపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఆమె పంపిణీ చేసి మాట్లాడారు.  గాంధీనగర్‌ చెరువు కోసం 65 వేలు, దాసాయిగూడెంలో రెండు చెరువుల కోసం  50 వేల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వాలు మత్స్య కారులను విస్మరించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమా నికి చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, కౌన్సిలర్‌ అనంతుల యాదగిరిగౌడ్‌, సిబ్బంది ఉపేం దర్‌, కార్మికులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-29T06:15:00+05:30 IST