స్టాన్‌స్వామి మృతిపై న్యాయవిచారణ చేయాలి

ABN , First Publish Date - 2021-07-12T06:03:30+05:30 IST

ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు ఫాదర్‌ స్టాన్‌స్వామి మృతిపై న్యాయవిచారణ చేపట్టాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు మండారిడేవిడ్‌కుమార్‌, కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్‌ చేశారు.

స్టాన్‌స్వామి మృతిపై న్యాయవిచారణ చేయాలి
స్టాన్‌స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

సూర్యాపేటటౌన్‌, జూలై 11: ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు ఫాదర్‌ స్టాన్‌స్వామి మృతిపై న్యాయవిచారణ చేపట్టాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు మండారిడేవిడ్‌కుమార్‌, కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలో స్టాన్‌స్వామి చిత్రపటం వద్ద ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవి ఖనిజ సంపదపై హక్కు ఆదివాసీలదేనని పోరాడిన మహోన్నతమైన వ్యక్తి స్టాన్‌స్వామి అని కొనియాడారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించి స్టాన్‌స్వామి అసహజ మరణానికి కేంద్ర ప్రభుత్వమే కారణమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణాచారి, కొత్తపల్లి శివకుమార్‌, కోటయ్య, లింగయ్య, యోగానంద్‌, వెంకన్న, వీరన్న, గుండాల సందీప్‌, అహ్మద్‌, నెమ్మాదివెంకటేశ్వర్లు, వేణు, నాగన్న, సింహాద్రి, వెంకటేశ్వర్‌రావు, రామకృష్ణ, రవికుమార్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T06:03:30+05:30 IST