కరోనా వేళ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత
ABN , First Publish Date - 2021-05-08T07:25:10+05:30 IST
అసలే గ్రామీణ ప్రాంతం కరోనా మహమ్మరి వి జృంబిస్తున్నవేళ శాలిగౌరారం పీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరత అయినా సిబ్బంది మాత్రం ఉప్పెనలా వస్తున్న ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అందరినోటా శభాష్ అనిపించుకుంటున్నారు.

సేవలకు లోటు రానివ్వని వైద్య సిబ్బంది
వైద్య సిబ్బందిని అభినందిస్తున్న ప్రజలు
శాలిగౌరారం, మే 7: అసలే గ్రామీణ ప్రాంతం కరోనా మహమ్మరి వి జృంబిస్తున్నవేళ శాలిగౌరారం పీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరత అయినా సిబ్బంది మాత్రం ఉప్పెనలా వస్తున్న ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అందరినోటా శభాష్ అనిపించుకుంటున్నారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి గత నాలుగు సంవత్సరాల క్రితం జాతీయ అవార్డు లభించింది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పీహెచ్సీ సేవలు అందించటంలో మండల వైద్యాధికారి డి.వెంకన్న నేతృత్వం లో సిబ్బంది అందిస్తున్న సేవలే అందుకు ప్రధాన కారణం. అయినా పీ హెచ్‌సీకి అరకొర సిబ్బంది గత కొంత కాలంగా వేధిస్తుంది. ఉన్న సిబ్బం ది ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ముగు ్గరు డాకర్లకు గాను ఒక్కరు, ముగ్గురు సూపర్వైజర్లకు గాను ఇద్దరు, ముగ్గురు స్టాప్ నర్స్‌లకు గాను ఇద్దరు, 18 మంది ఏఎన్ఎంలకు గాను 9 మంది, ఏడుగురు హెల్త్అసిస్టెంట్లకు గాను ఆరుగురు చొప్పున ఉన్నా రు. సిబ్బంది కొరత ఉన్నా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉన్న సిబ్బందితో వైద్యాధికారి మనోధైర్యంతో సేవలు అందిస్తున్నారు. పీహెచ్సీకీ జిల్లా అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
సిబ్బంది కొరత ఉన్నా సేవలు అందిస్తున్నాం
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అన్ని విభాగాల్లో సగం సిబ్బంది ఉన్నారు. సిబ్బంది తక్కువ ఉన్నా కరోనా కాలంలో ఏలాంటి లోటుపాట్లు లేకుండా సేవలు అందిస్తున్నాం. ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ చేయాలని పై అధికారులకు నివేదిక ఇవ్వటం జరిగింది. మండలంలో 25 గ్రామాలు ఉండటంతో రోగుల సంఖ్య బాగాఉంటుంది. అయినా సిబ్బంది కరోనా పరీక్షలు చేయటంలో, కరోనా వ్యాక్సిన్ ఇవ్వటంలో మంచిగా పనిచేస్తున్నారు.
- శాలిగౌరారం మండల వైద్యాధికారి డి.వెంకన్న
వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు
అర్వపల్లి : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ ఒక్క స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఒక్క స్టాఫ్ నర్సు కూడా 4 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకడంతో హోంక్వారంటైన్లో ఉన్నారు. మండలంలోని కాసర్లపా డు గ్రామంలో ఏఎన్ఎం కొరతతో సైర వైద్యం అందించలేకపోతున్నారు. సూపర్వైజ ర్లు కొరత కూడా ఉండడంతో ఏఎన్ఎంల కు వైద్య సిబ్బంది సూచనలు ఇచ్చేవారు కరువయ్యారు. అర్వపల్లి ఎస్బీఐలోకి ఐదుగురుని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. కరోనా వ్యాధి భయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది జంకుతున్నారు. అర్వపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుదారులు మాత్రమే కావాలని, గుంపులు, గుంపులుగా రావద్దని పోలీసు సిబ్బంది ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మండలంలో రోజురోజుకూ 30నుంచి 45 పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో వైద్య సిబ్బంది కూడా భయపడుతున్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా బాధితులు
నేరేడుచర్ల: అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కరోనా పేషెంట్లు ఉం డడంతో ఆయా విభాగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టాఫీసులో ఇద్దరు పోష్టుమెన్లకు కరోనా సోకింది. పింఛను కోసం వచ్చే వృద్దులు క్యూలో నిలబడకుండా ఇబ్బంది పెడుతున్నారని, చెబితే వినే పరిస్థితి లేదని, వారికి శానిటేషన్ చేస్తే వేలి ముద్రలు పడడం లేదని, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని గొడవకు దిగుతున్నారని సిబ్బంది తెలిపారు. మాస్కులు కూడా పెట్టడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాంరెడ్డి కి కరోనా సోకింది. మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా సోకింది. మార్కెట్ కార్యాలయంలో ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకింది. మున్సిపల్ కార్యాలయంలో ముగ్గురు స్వీపర్లకు కరోనా సోకింది. కార్యాలయాలకు వచ్చే వారు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించక పోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. ఆసుపత్రుల్లో జనం ఎగబడుతుండడంతో వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదయం 7 గంటలకే భారీగా జనం వ్యాక్సిన్, టెస్టుల కోసం వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం శానిటేషన్ చేసేందుకు కూడా వీలు లేకుండా పోతుందని డాక్టర్ నాగయ్య ఆవేద న వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణ శుభ్రం చేసేందుకు కూడా సమ యం ఉండడం లేదన్నారు. గేటు వేస్తే లోనికి రానివ్వడం లేదని కొందరు దూషిస్తున్నారని, శానిటేషన్ చేసే సమయం ఇవ్వక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
అందరూ భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని, కరోనా టెస్టులు చేయించుకుని పాజిటీవ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని బయట తిరగవద్దని డాక్టర్ సూచించారు.
- డాక్టర్ నాగయ్య