వరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక సందడి

ABN , First Publish Date - 2021-08-21T06:59:54+05:30 IST

శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రత పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పలువురు ఇళ్లలో వ్రతాలను ఆచరించారు.

వరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక సందడి
చౌటుప్పల్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు

చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 20: చౌటుప్పల్‌లోని శ్రీసీతారామ చంద్రస్వామి, అయ్యప్పస్వామి దేవాలయాల్లో మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతా లను ఆచరించారు. కార్యక్రమాల్లో మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం గౌడ్‌, దేవస్థాన కమిటీల అధ్యక్షులు డి.గోవర్థన్‌రెడ్డి, బి.మురళి తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: మండల కేంద్రంలోని హరిహర త్రిశక్తి క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి,  మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, ఫలాలతో అర్చ కులు అలంకరణ చేశారు. మండలంలోని పలు ఆలయాలు అమ్మవార్ల నామస్మరణలతో మార్మోగాయి.

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిల్లోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవా లయంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి భజనమండలి, మార్కండేశ్వరస్వామి దేవాలయంలో శ్రీశంకర మహిళా భజనమండలి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.

సంస్థాన్‌ నారాయణపురం: మండలంలో శుక్రవారం పలు దేవాలయాల్లో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు సామూహికంగా ఆచరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి. 

యాదాద్రి రూరల్‌: యాదగిరిగుట్ట పట్టణంలో అత్యంత వైభవంగా వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. మహిళలు అమ్మవార్లను పూలు, పండ్లు, పసుపు, కుంకుమతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చౌటుప్పల్‌ రూరల్‌:  శ్రావణ శుక్రవారం సందర్భంగా చౌటుప్పల్‌ మండలంలోని దేవాలయాల్లో, ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు.  లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు.



 


Updated Date - 2021-08-21T06:59:54+05:30 IST