వరిసాగుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలి: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-12-08T06:35:44+05:30 IST

మూసీ పరివాహక ప్రాంతమైన భూదాన్‌పోచంపల్లిలో వరి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలని భూదాన్‌పోచంపల్లి మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పాక మల్లేశంయాదవ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గునిగంటి రమేష్‌గౌడ్‌ డి మాండ్‌ చేశారు.

వరిసాగుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలి: కాంగ్రెస్‌
భూదాన్‌పోచంపల్లిలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పాక మల్లేశంయాదవ్‌

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 7: మూసీ పరివాహక ప్రాంతమైన భూదాన్‌పోచంపల్లిలో వరి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలని భూదాన్‌పోచంపల్లి మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పాక మల్లేశంయాదవ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గునిగంటి రమేష్‌గౌడ్‌ డి మాండ్‌ చేశారు. భూదాన్‌పోచంపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూసీ పరివాహకంలో కేవ లం వరి మాత్రమే సాగు అవుతుందనే విషయాన్ని గుర్తించి ఈ ప్రాంత రైతులకు యాసంగిలో వరిసాగు చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వా లని కోరారు. ధాన్యం కల్లాల్లోనే ఉందన్నారు. తరుగు పేరిట మిల్లర్లు రైతు లను దోపిడీ చేస్తున్నారన్నారు. రవాణా చార్జీల కోసం బస్తాకు రూ.2లు, తరుగుకోసం రెండు కిలోలు తీస్తున్నారన్నారు. తరుగు పేరిట కోత విధించే విధానాన్ని అధికారులు నిరోధించాల ఆయన కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చ రించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌పార్టీ నాయకులు అనిరెడ్డి జగన్‌రెడ్డి, కాసుల అంజయ్య గౌడ్‌, భారత లవకుమార్‌, ఎంపీటీసీ చిలుక బుచ్చయ్య పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-08T06:35:44+05:30 IST