నూతన సంవత్సరానికి నృసింహ క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-12-28T06:19:59+05:30 IST

ఆంగ్ల నూతన సంవత్సరాది జనవరి 1న భక్తుల రద్దీ అధికంగా ఉండనుండటంతో యాదాద్రి ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నూతన సంవత్సరానికి నృసింహ క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు
చరమూర్తులకు హారతి నివేదిస్తున్న అర్చకుడు

నూతన సంవత్సరానికి నృసింహ క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 27: ఆంగ్ల నూతన సంవత్సరాది జనవరి 1న భక్తుల రద్దీ అధికంగా ఉండనుండటంతో యాదాద్రి ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆలయ వేళల్లో మా ర్పులు చేశారు. రోజుకంటే గంట ముందుగా జనవరి 1న ఉదయం 3గంటలకే ఆలయాన్ని తెరిచి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5.15 గంటల నుంచి భక్తులకు బాలాలయ కవచమూర్తు ల దర్శనాలు కల్పించనున్నారు. బాలాలయం,అనుబంధ పాతగుట్ట ఆలయాలను మామి డి,అరటి తోరణాలు,వివిధ రకాల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. యాదాద్రికి వచ్చే భక్తులకు సరిపడా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. 100గ్రాములు, 500 గ్రాముల లడ్డూలను సుమారు 60వేలు, పులిహోర ప్రసాదాలను నిరంతరం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు విక్రయించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధనలు, భౌతిక దూ రం పాటించాలని, విధిగా మాస్క్‌ ధరించాలని ఈవో గీతారెడ్డి కోరారు. దర్శన క్యూలైన్ల ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.

జనవరి 13న ముక్కోటి ఏకాదశి వేడుకలు

యాదాద్రీశుడి సన్నిధిలో జనవరి 13న ముక్కోటి ఏకాదశి వేడుకలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నందున తాత్కాలిక బాలాలయ విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉదయం 6.49గంటలకు వైకుంఠనాధుడి దర్శనం భక్తులు కల్పించనున్నారు. అనుబంధ ఆలయం పాతగుట్ట దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పాతగుట్ట, కొండపైన ఆలయాలను ఉదయం 3.30గంటలకే తెరిచి నిత్య పూజలు నిర్వహిస్తారు. ఆలయ పూజా వేళల్లో సైతం మార్పులు చేశారు. అలంకార సేవను ఉదయం6.49 గంటల నుంచి 9గంటల వరకు నిర్వహించనున్నారు. జనవరి 13నుంచి ఆలయ వార్షిక అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆరు రోజుల పాటు జవరి 18వ తేదీ వరకు కొనసాగే అధ్యయనోత్సవాల సందర్భంగా మొక్కు, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహోమం, లక్షపుష్పార్చన పూజలు నిలిపివేయనున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.

హరిహరులకు విశేష పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం లో హరిహరులకు సోమవారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బాలాలయంలోని కవచమూర్తులను సువర్ణ పు ష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి అర్చనలు నిర్వహించారు. అ నంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలను ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. సువర్ణపుష్పార్చనలు, అష్టోత్తర పూజలు కొనసాగాయి. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లో కొలువుదీరిన చరమూర్తులకు నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అష్టోత్తర పూజలు, సాయంత్రం వేళ బాలాలయంలో అలంకార వెండి జోడు సేవోత్సవాలు కొనసాగాయి. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవిని పంచామృతాలతో అభిషేకించారు. కాగా, స్వామి వారికి వివిధ విభాగాల ద్వారా రూ.13,20,263 ఆదాయం సమకూరింది.

పారదర్శకంగా పాచక, అర్చక పోస్టులు భర్తీ చేస్తాం : ఈవో

యాదాద్రి దేవస్థానంలో అర్చక, పాచక పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామ ని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ మేరకు దేవాదాయశాఖ నియమించిన బృందం సోమవారం యాదాద్రిని దర్శించుకోగా, పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను ఆమె వివరించారు. 21 అర్చక, పాచక పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ అయిందని, కమిటీ పర్యవేక్షణలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులు భర్తీచేస్తామన్నారు.

Updated Date - 2021-12-28T06:19:59+05:30 IST