చికిత్స పొందుతూ ఒకరు..

ABN , First Publish Date - 2021-10-25T06:21:41+05:30 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ఆదివారం మృతిచెందాడు.

చికిత్స పొందుతూ ఒకరు..

నార్కట్‌పల్లి, అక్టోబరు 24: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శేరుబావిగూడెం గ్రామానికి చెందిన నాగులంచ సైదారావు (35) గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై ఈనెల 22న గ్రామ శివారు వద్ద క్రిమసంహారక మందు తాగాడు. గమనించిన పరిసర రైతులు సైదారావును నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని అతడి సోదరి మాదారపు జయమ్మ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2021-10-25T06:21:41+05:30 IST