విద్యుత సమస్యలు పరిష్కరించుకోండిలా
ABN , First Publish Date - 2021-05-24T06:00:32+05:30 IST
విద్యుత వినియోగదారుల సమస్యల పరి ష్కారానికి దక్షిణ తెలంగాణ విద్యుత పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) శ్రీకారం చుట్టింది.

విలువైన సేవలకు సంస్థ శ్రీకారం
ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు
భువనగిరి టౌన, మే 23 : విద్యుత వినియోగదారుల సమస్యల పరి ష్కారానికి దక్షిణ తెలంగాణ విద్యుత పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వినియోగదారులు ఇంటి నుంచే ఫిర్యాదులు చేసి సమస్య పరిష్కరించుకునే వెసులుబాటు అందుబాటులోకి తెచ్చింది. సీజీఆర్‌ఎఫ్-ఐ (రూరల్) పరిధిలోని 11జిల్లాల విద్యుత విని యోదారుల ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వచ్చిన ఫిర్యా దులను వెంటనే స్థానిక కార్యాలయాలకు అందించి పరిష్కా రం అయ్యే వరకు పర్యవేక్షిస్తామని కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు సీజీఆర్‌ఎఫ్-ఐ (రూరల్) పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జి ల్లాలోని విద్యుత వినియోగదారులు ఎదుర్కొంటున్న సమ స్యలపై ఫిర్యాదులు చేసి పరిష్కరించుకో వాలని భువనగిరి ట్రాన్సకో ఏడీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు.
ఫిర్యాదు అంశాలు
విద్యుత సరఫరా పునరుద్ధరణలో జాప్యం
బకాయిలు చెల్లించాక విద్యుత సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం
విద్యుత సరఫరా తొలగింపు(డిస్కనెక్షన)
కాలిపోయిన ట్రాన్సఫార్మర్ మార్పులో ఆలస్యం
విద్యుత సరఫరాలో అంతరాయాలు
విద్యుత మీటర్లలో ఇబ్బందులు
విద్యుత బిల్లులో తప్పులు, తప్పుడు రీడింగులు
కొత్త సర్వీస్ మంజూరు సమస్యలు
పేరు బదిలీ, సర్వీస్ క్యాటగిరీ మార్పు, చిరునామా మార్పు మొదలైనవి
విద్యుత వినియోగదారుల సేవా ప్రమాణాల సమస్యలు
ఫిర్యాదులు ఇలా..
విద్యుత సమస్యలపై వినియోగదారులు తమ ఫిర్యాదు లను రాత పూర్వకంగా, పోస్టు ద్వారా, ఈ మెయిల్ లేదా వాట్సాప్‌తో ఇన్ఫర్మేషన టెక్నాలజీ-2000 చట్టంలో పేర్కొన్న ఇతర మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత చౌర్యం, వి ద్యుత ప్రమాదాల పరిహారం చెల్లింపులు, కోర్టులో ఉన్న సమస్యలు ఫోరం పరిధిలోకి రానందున ఆ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోరు. నిబంధనల మేరకు వచ్చిన ఫిర్యాదులను భారత విద్యుత చట్టం, రాష్ట్ర విద్యుత నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు విచారించి పరిష్కరిస్తారు.
ఫిర్యాదుల చిరునామా
సీజీఆర్‌ఎఫ్-ఐ (రూరల్) ఇంటి నెంబర్ 8-03-167/14, జీటీఎస్ కాలనీ వెంగల్‌రావ్‌నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్-500045.
ఫోన నెంబర్లు
చైర్‌పర్సన- 8333925422
మెంబర్ టెక్నికల్ - 9440813914
మెంబర్ ఫైనాన్స - 9440813915
ఇండిపెండెంట్ మెంబర్(టీఎస్‌ఈఆర్‌సీచే ఎన్నుకోబడిన వ్యక్తి)- 9440539927