రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-12-08T07:01:45+05:30 IST

జాతీయ రహదారి 65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి


నార్కట్‌పల్లి, డిసెంబరు 7: జాతీయ రహదారి 65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండల కేంద్రం శివారులోని నల్లగొండ రోడ్డులో గల ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన హర్షవర్థన్‌రెడ్డి (30) అనే యువకుడు హైద్రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేట నుంచి హైద్రాబాద్‌కు వెళ్తున్న టీఎ్‌స-29టీ 7851 నెంబర్‌ గల డీసీఎం వ్యాన్‌లో హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నాడు. హైవేపై డీసీఎం నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకోగానే అతివేగం డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా అదుపుతప్పి ముందుగా ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో నుజ్జునుజ్జయిన డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన హర్షవర్థన్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-12-08T07:01:45+05:30 IST