ఫొటో స్టూడియోలో నుంచి పొగలు

ABN , First Publish Date - 2021-08-21T06:33:05+05:30 IST

భువనగిరి బస్‌స్టేషన్‌ ఎదురుగా నల్లగొండ రోడ్డు వెంట మొదటి అంతస్తులో మూసి ఉన్న ఓ ఫోటో, వీడియో డిజైనింగ్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి.

ఫొటో స్టూడియోలో నుంచి పొగలు

భువనగిరి టౌన్‌, ఆగస్టు 20: భువనగిరి బస్‌స్టేషన్‌ ఎదురుగా నల్లగొండ రోడ్డు వెంట మొదటి అంతస్తులో మూసి ఉన్న ఓ ఫోటో, వీడియో డిజైనింగ్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి.  స్థానికులు స్టూడియో భవనంలోని వెంటిలేటర్ల నుంచి నీళ్లు చల్లడంతో పాటు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చే సరికి పొగలు ఆగిపోయాయి.  అనంతరం యజమానులు స్టూడియోను తెరిచి, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పొగలు వచ్చాయని గుర్తించారు. ఈ ఘటనలో  స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు స్టూడియో యజమానులు తెలిపారు. 


Updated Date - 2021-08-21T06:33:05+05:30 IST