ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-03-14T06:07:27+05:30 IST

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పానగల్లు చాయాసోమేశ్వరాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు శనివారం ముగిశాయి.

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
పానగల్‌ పచ్చల సోమేశ్వరాలయంలో అగ్నిగుండాల్లో నడుస్తున్న భక్తులు


నల్లగొండ కల్చరల్‌, మార్చి 13: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పానగల్లు చాయాసోమేశ్వరాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు శనివారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ వేదపండితులను సన్మానించారు. ఈసందర్భంగా అలయ కమిటీ చైర్మన్‌ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సకల ఏర్పాట్లకు సహకరించారని తెలిపారు. భక్తులు వేలసంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించారని అన్నారు. కార్యక్రమంలో అర్చక స్వాములు, కమిటి సభ్యులు శివప్రసాద్‌, యానాల ప్రభాకర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, సందీప్‌, పద్మ, యాదయ్య,  పాల్గొన్నారు. 

భక్తితో పచ్చల సోమేశ్వరాలయంలో అగ్నిగుండాలు

  మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పానగల్లు శ్రీప చ్చల సోమేశ్వరాలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో  కార్యక్ర మంలో ఆలయ ప్రఽధాన అర్చకుడు నవీన్‌శర్మ, మహేష్‌, యాద గిరి, యాదయ్య పాల్గొన్నారు. 

ఆధ్యాత్మిక చింతన ఉండాలి: ఎంపీపీ 

మర్రిగూడ :  ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఉండాలని ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటే్‌షగౌడ్‌లు అన్నారు. మర్రిగూడలోని భవాని రామలింగేశ్వరస్వామి బ్రహోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. 

మిర్యాలగూడ ఉమామహేశ్వర ఆలయంలో...

మిర్యాలగూడ టౌన్‌: ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పార్వతీ పరమేశ్వరులకు తెప్పోత్సవం నిర్వహించారు.  

భైరవునిబండలో ఘనంగా బోనాల ప్రదర్శన

శాలిగౌరారం: మండలంలోని బైరవునిబండ గ్రామంలో గంగాభవానీ సమేత ఉమామహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తు న్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దండ రేణుకఅశోక్‌రెడ్డి, ఆలయ ఇన్‌చార్జి దండ యాదగిరిరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నర్సిరెడ్డి పాల్గొన్నారు.   

 పార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణం

మునుగోడు రూరల్‌ : మండలంలోని కొంపెల్లి పార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. చీకూరి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 15వ తేదీ తెల్ల వారుజామున నిర్వహించబోయే అగ్నిగుండాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజ యవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్‌ శ్రీను, దేవాలయ కమిటీ సభ్యులు  అప్పారావు, సర్పంచ్‌వెంకన్నయాదవ్‌, ఎంపీటీసీ సాలయ్యగౌడ్‌,  లింగయ్య, మాజీ ఎంపీటీసీ పార్వతిలింగయ్య, అన్నమయ్య, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-14T06:07:27+05:30 IST