ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2021-12-30T16:19:34+05:30 IST
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని అలవర్చుకున్నప్పుడే శాంతియుత సమాజం నెలకొంటుందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన అన్నారు.

భువనగిరి రూరల్, డిసెంబరు 29: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని అలవర్చుకున్నప్పుడే శాంతియుత సమాజం నెలకొంటుందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన అన్నారు. మండలంలోని అనాజిపురం గ్రామంలో దాదాపు 150సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం శిథిలావస్థకు చేరడంతో దాతల సహకాంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎదునూరి ప్రేమలత, ఉప సర్పంచ్ మైలారం వెంకటేశ్, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఆలయ నిర్మాణ దాత పన్నాల వెంకట్ రాంరెడ్డి, గ్రామస్థులు గునుగుంట్ల శ్రీనివాస్, ఎదునూరి మల్లేశం, బింగి జంగయ్య, జగన్, కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.