కోదాడకు చేరుకున్న శేఖర్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-15T07:09:48+05:30 IST

మంత్రి కేటీఆర్‌పై వీరాభిమానంతో ఆయనను కలవాలని ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ కుడు హైదరాబాద్‌ వరకు ప్రారంభించిన పాద యాత్ర కోదాడకు మంగళవారం చేరింది.

కోదాడకు చేరుకున్న శేఖర్‌ పాదయాత్ర
కోదాడకు చేరుకున్న శేఖర్‌

కేటీఆర్‌పై అభిమానంతో శ్రీకాకుళం నుంచి వస్తున్న యువకుడు 

 కోదాడటౌన్‌, డిసెంబరు 14: మంత్రి కేటీఆర్‌పై వీరాభిమానంతో ఆయనను కలవాలని ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ కుడు హైదరాబాద్‌ వరకు ప్రారంభించిన పాద యాత్ర కోదాడకు మంగళవారం చేరింది.    కేటీఆర్‌పై అభిమానంతో శ్రీకాకుళం జిల్లా రాజం మండలం సారథి గ్రామానికి చెందిన వండాన శేఖర్‌  నవంబరు 30వ తేదీన పాద యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర కోదా డకు చేరిన సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 900 కి.మీ నడిచినట్లు  తెలిపారు. ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయం వచ్చినట్లు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం బసచేసి బుధవారం పాదయాత్రను కొనసాగిస్తానన్నా రు. శేఖర్‌కు కోదాడ పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. 

Updated Date - 2021-12-15T07:09:48+05:30 IST