నేడు చింతపల్లికి షర్మి రాక

ABN , First Publish Date - 2021-10-31T06:29:57+05:30 IST

వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు షర్మిల పాదయాత్ర ఈనెల 31న చింతపల్లి మండలానికి చేరుకుంటుందని ఆపార్టీ జిల్లా నాయకుడు బెదరకోట భాస్కర్‌, మండల కన్వీనర్‌ సిద్దగోని నవీన్‌గౌడ్‌ తెలిపారు.

నేడు చింతపల్లికి షర్మి రాక

చింతపల్లి, అక్టోబరు 30: వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు షర్మిల పాదయాత్ర ఈనెల 31న చింతపల్లి మండలానికి చేరుకుంటుందని ఆపార్టీ జిల్లా నాయకుడు బెదరకోట భాస్కర్‌, మండల కన్వీనర్‌ సిద్దగోని నవీన్‌గౌడ్‌ తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31న సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి మండలంలోని వీటీనగర్‌కు పాదయాత్ర చేరుకుంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు స్థానికులతో సమావేశం నిర్వహించి, అనంతరం మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్‌లో రాత్రి బస ఉంటుందని రెండు రోజులపాటు చింతపల్లి మండలంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. 

Updated Date - 2021-10-31T06:29:57+05:30 IST