వేణుగోపాలస్వామి ఆలయంలో శార్దూల వాహన సేవ
ABN , First Publish Date - 2021-07-08T05:53:14+05:30 IST
జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో శార్దూల వాహనసేవ కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు.

సూర్యాపేట కల్చరల్, జూలై 7: జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో శార్దూల వాహనసేవ కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు. నవకలశస్థాపన, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు, మూలవిరాట్‌లకు చతుస్థానార్చన, చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ఆరాధనలను అర్చకులు నల్లాన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు నిర్వహించారు. సాయంత్రం పుష్పయాగం, ఏకాంత సేవ, శ్రీపుష్పయాగం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు ప్రభాకర విజయ్‌స్వామి, సుదర్శన్‌స్వామి, ఉప్పల గోపాలకృష్ణయ్య, కందిమల్ల శంకర్, విజయ్‌కుమార్, రమేష్, రవీందర్ పాల్గొన్నారు.
మఠంపల్లి(మేళ్లచెర్వు): మండలంలోని రేవూరులో వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవాలను వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. బొర్రా వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో గురువారం స్వామి వారి కల్యాణాన్ని నిర్వ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.