విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2021-12-31T16:29:33+05:30 IST

విద్యార్థు ల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ 51 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్‌ఎఫ్‌ఐ

ఘనంగా సంఘ వసంతోత్సవం 

మిర్యాలగూడ, నల్లగొండ క్రైం, డిసెంబరు 30: విద్యార్థు ల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ 51 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గురువారం ఎస్‌ఎ్‌ఫఐ వసంతోత్సవం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉద్యమాల రథసారధిగా ఉంటుందని అన్నారు. జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకి స్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. శాస్ర్తీయ విద్యావిధానం కోసం పోరాడుతూ ఎస్‌ఎ్‌ఫఐ విద్యార్థి ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచిందని అన్నారు. మిర్యాలగూడలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీ స భ్యుడు ఎర్ర శ్రీకాంత్‌ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమం లో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యులు మూడావత్‌ జగన్‌ నాయక్‌, రంగరాజు, రాకేష్‌, తరుణ్‌, మధు, సురేష్‌, రంగా, అనిల్‌, వంశీ, నవీన్‌, పవన్‌, వినయ్‌కుమార్‌, కిరణ్‌, నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు బోగరి సుకుమార్‌, మా దసు రావన్‌, ఊదరి యువరాజు, నవీన్‌, కోటేష్‌, సాయి చరణ్‌, హానుమంతు, శ్రీకాంత్‌, సైదా, కోటి, లచ్చిరాం, హనుమ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-12-31T16:29:33+05:30 IST