విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియనకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-10-19T06:21:41+05:30 IST

విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.

విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియనకు తీవ్రగాయాలు

గరిడేపల్లి, అక్టోబరు 18 : విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌లో ని ట్రాన్సఫార్మర్‌ ఫ్యూజ్‌ కాలిపోయింది. ఎలక్ర్టీషియన ప్రవీణ్‌ను పిలవగా అతడు మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బంక్‌ సిబ్బంది వెంటనే మిర్యాలగూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషయమై ట్రాన్సకో ఏఈ నగే్‌షను వివరణ కోరగా పెట్రోల్‌ బంక్‌లో ఫ్యూజ్‌ వేసేందుకు వెళ్లిన ప్రవీణ్‌ లైనమనకు గాని, తనకు గాని సమాచారం ఇవ్వలేదని, కనీసం ఎల్‌సీ తీసుకోలేదని తెలిపారు.


Updated Date - 2021-10-19T06:21:41+05:30 IST