విద్యుదాఘాతంతో ఆర్టిజన్‌కు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-08T06:23:50+05:30 IST

విద్యుదాఘాతంతో విద్యుత్‌ శాఖ ఆర్టిజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

విద్యుదాఘాతంతో ఆర్టిజన్‌కు తీవ్ర గాయాలు

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 7: విద్యుదాఘాతంతో విద్యుత్‌ శాఖ ఆర్టిజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన  వివరాల ప్రకారం.. మండంలోని జూలూరు గ్రామానికి చెందిన మూటపురం బాబు రావు విద్యుత్‌ శాఖలో ఆర్టిజన్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గాలిదుమా  రానికి భూదాన్‌పోచంపల్లిలోపి కర్నాటి రమాదేవి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో మంగళవారం ధాన్యం పైకప్పు పాలిథిన్‌ పట్టా పైకి లేచి  33 కేవీ లైన్‌పై పడింది.  ఆ పట్టాను  తొలగించడానికి లైన్‌మన్‌ నాగరాజు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావులు బాబురావుని మరమ్మత్తుల నిమిత్తం తీసుకెళ్లారు. ముంద స్తుగా లైన్‌ క్లియరెన్స్‌ కన్ఫర్మేషన్‌ చేసుకోకుండానే బాబురావుని స్తంభం ఎక్కించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన బాబూరావు స్తంభం నుంచి కిందపడ్డాడు. అతడి ఎడమ చెయ్యి పూర్తిగా కాలడంతో అంబు లెన్స్‌లో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. బాబూరావుకుు లివర్‌, కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు. 

‘బాబూరావు కుటుంబానికి న్యాయం చేయాలి’ 

నిర్లక్ష్యంగా తోటి ఉద్యోగిని విద్యుత్‌ స్తంభం ఎక్కించి ప్రాణాపాయ స్థితికి తెచ్చిన అధికారులపై  చర్యలు తీసుకోవాలని  ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము లక్ష్మణ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. బాబురావు వైద్యానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-12-08T06:23:50+05:30 IST