సురక్షితంగా చేరిన ఏవోబీ ఆపరేషన్‌ బృందం

ABN , First Publish Date - 2021-10-20T06:51:51+05:30 IST

గంజాయి ముఠా కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీకి వెళ్లిన నల్లగొండ జిల్లా పోలీస్‌ బృందం సురక్షితంగా స్వస్థలానికి చేరింది. ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన పోలీస్‌ బృందాలు ఐదు రోజుల క్రితం గంజాయి ముఠా కోసం ఏవోబీకి వెళ్లాయి.

సురక్షితంగా చేరిన ఏవోబీ ఆపరేషన్‌ బృందం

1500కిలోల గంజాయి స్వాధీనం?

పోలీసుల అదుపులో 40మంది ముఠా సభ్యులు


నల్లగొండ క్రైం, అక్టోబరు 19: గంజాయి ముఠా కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీకి వెళ్లిన నల్లగొండ జిల్లా పోలీస్‌ బృందం సురక్షితంగా స్వస్థలానికి చేరింది. ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన పోలీస్‌ బృందాలు ఐదు రోజుల క్రితం గంజాయి ముఠా కోసం ఏవోబీకి వెళ్లాయి. ఈనెల 16వ తేదీన అక్కడి గంజాయి స్మగ్లర్లు పోలీస్‌ జీపులను అడ్డుకొ ని కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో పోలీస్‌ బృందాలు ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు చేశాయి. అయితే పక్కా సమాచారం మేరకు వెళ్లిన పోలీ స్‌ బృందాలు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న ట్లు సమాచారం. ఏవోబీలో సుమారు 1500కిలోల గంజాయితో పాటు 40 నుంచి 50మంది గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిసింది. నేడో, రేపో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Updated Date - 2021-10-20T06:51:51+05:30 IST