సారా తయారీ ముడిసరుకు పట్టివేత
ABN , First Publish Date - 2021-12-31T16:38:24+05:30 IST
భారీగా సారా త యారీ ముడిసరుకుతో పాటు 10 లీటర్ల నాటుసారాను ఎక్సై జ్ పోలీసులు గురువారం ప ట్టుకున్నారు.

దేవరకొండ, డిసెంబరు 30: భారీగా సారా త యారీ ముడిసరుకుతో పాటు 10 లీటర్ల నాటుసారాను ఎక్సై జ్ పోలీసులు గురువారం ప ట్టుకున్నారు. దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరా ల ప్రకారం దేవరకొండ ఎక్సై జ్ సర్కిల్ పరిధిలోని కొత్తపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీఎస్ 05 యూడీ 4987 వాహనంలో తరలిస్తున్న నాటుసారా తయారీకి ఉపయోగించే తొ మ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కిలోల పటికతో పాటు 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీటి విలువ రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు. వాహన డ్రైవర్ చింతలతండాకు చెందిన రమావత్ సూరతో పాటు వాహనానికి పైలెట్స్ ఉన్న వద్దిపట్లకు చెందిన నాగు, అజ్మాపురం గ్రామానికి చెందిన వస్కుల ముత్యాలును కూడా అరెస్టు చేసి వారి నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ ఎస్‌ఐ సూర్యప్రకాశ్, సిబ్బంది కృష్ణ, ఫుద్వీ, ప్రవీణ్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు.