గూడూరు టోల్‌ ప్లాజా వద్ద గోవుల పట్టివేత

ABN , First Publish Date - 2021-12-25T06:28:25+05:30 IST

ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ బహద్దుర్‌పురకు అక్రమంగా తరలిస్తున్న గోవులను బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున బీబీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు.

గూడూరు టోల్‌ ప్లాజా వద్ద గోవుల పట్టివేత
పట్టుబడిన గోవులు

బీబీనగర్‌, డిసెంబరు 24: ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ బహద్దుర్‌పురకు అక్రమంగా తరలిస్తున్న గోవులను బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున బీబీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్వాధీన పరుచుకున్న పశువులను రాజాపేట మండలం చల్లూరు గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశలోని తుని, చెర్ల ప్రాంతాల నుంచి శేఖర్‌, రియా్‌సలు ఆవులు, ఎద్దులు కలిపి మొత్తం 79 పశువులను రెండు డీసీఎం వాహనాల్లో హైదరాబాద్‌లోని బహద్దుర్‌పురకు తరలిస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు గూడూరు టోల్‌ ప్లాజా వద్ద నిఘా ఉంచి, గోవులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకొని నరేష్‌, ఇర్షద్‌ అనే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని గోవులను స్వాధీనం చేసుకున్నారు. పశువులను తరలిస్తున్న యజమానులు, వాహన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-25T06:28:25+05:30 IST