47 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-02T06:56:29+05:30 IST

హైద్రాబాద్‌-విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై మండల పరిధిలో సోమవారం వాహన తనిఖీ చేస్తుండగా సుమారు 47 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు.

47 కేజీల గంజాయి పట్టివేత

నార్కట్‌పల్లి, నవంబరు 1: హైద్రాబాద్‌-విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై మండల పరిధిలో సోమవారం వాహన తనిఖీ చేస్తుండగా సుమారు 47 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు. హైవేపై కామినేని జంక్షన్‌ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా మండలంలోని పల్లెపహాడ్‌కు చెందిన గొలుసుల నరేశ్‌ నుంచి 25 కేజీలు, గోపలాయపల్లి వద్ద ఇదే గ్రామానికి చెందిన దేశగాని మల్లిఖార్జున్‌ నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4లక్షలు ఉండొచ్చని చెప్పారు. 


Updated Date - 2021-11-02T06:56:29+05:30 IST