10 లీటర్ల సారా పట్టివేత
ABN , First Publish Date - 2021-10-29T06:04:47+05:30 IST
సారా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్‌ఐ శివప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని వెంపటి గ్రామంలో గురువారం తనిఖీలు నిర్వహించారు.
తుంగతుర్తి, అక్టోబరు 28 : సారా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్‌ఐ శివప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని వెంపటి గ్రామంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మానాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై 10 లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకున్నారు. బైక్‌ను సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.