10లీటర్ల నాటుసారా స్వాధీనం - ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-21T06:05:06+05:30 IST

మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న నేనావత్‌ రవీందర్‌, రమణిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

10లీటర్ల నాటుసారా స్వాధీనం - ఇద్దరి అరెస్టు

దేవరకొండ, ఆగస్టు 20 : మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న నేనావత్‌ రవీందర్‌, రమణిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి 10లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటుసారా తయారీదారులపై నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్‌లో జోరుగా నాటుసారా విక్రయాలు అనే కథనంతో ఈ నెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి దేవరకొండ ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం స్పందించారు.

Updated Date - 2021-08-21T06:05:06+05:30 IST