పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోతే సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2021-08-28T04:56:35+05:30 IST

పారిశుధ్యం పనులు చేపట్టకపోతే సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డీపీవో యాదయ్య అన్నారు.

పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోతే సీజనల్‌ వ్యాధులు
చిలుకూరులో రికార్డులను పరిశీలిస్తున్న సయ్యద్‌ ఇమామ్‌

పెన్‌పహాడ్‌ / చిలుకూరు / నూతనకల్‌ / మద్దిరాల, ఆగస్టు 27 :  పారిశుధ్యం పనులు చేపట్టకపోతే సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డీపీవో యాదయ్య అన్నారు. పెన్‌పహాడ్‌ మండలం అనాజిపురం, దోసపహాడ్‌ గ్రామాల్లో అభివృద్ధి పనులను శుక్రవారం పర్యవేక్షించారు. అనాజిపురంలో బురదమయమైన వీధిని చూసి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు, నర్సరీలు, పారిశుధ్యం, వైద్య, ఆరోగ్య ఉపకేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌లు చెన్ను శ్రీనివా్‌సరెడ్డి, దొంగరి సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శులు మామిడి వేణు, నాగేశ్వర్‌రావు, రమేష్‌ పాల్గొన్నారు. చిలుకూరు మండల కేంద్రంతో పాటు ఆర్లెగూడెంలో ఉపాధి పనులను, రికార్డులను నడిగూడెం ఎంపీడీవో సయ్యద్‌ఇమామ్‌ పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి శోభన్‌బాబు, టీఏ స్వాతి, ధర్మయ్య, ఆంజనేయులు తదితరులున్నారు. అదేవిధంగా నూతనకల్‌ మండల కేంద్రంలో ఉపాధిహామీ పనులు చాలా బాగున్నాయని ఈసీ సీహెచ్‌ నగేష్‌ అన్నారు. ఉపాధిహామీ పనుల రికార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి, కార్యదర్శి రాజేష్‌ ఉన్నారు. అదేవిధంగా మద్దిరాల మండల కేంద్రంతో పాటు మామిండ్లమడవ, జి.కొత్తపల్లి, చందుపట్ల, కుక్కడం, గుమ్మడవెల్లి గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ రికార్డులను తిరుమలగిరి ఎంపీడీవో ఉమే్‌షచారి, ఎంపీవో మారయ్య పరిశీలించారు.  వారి వెంట పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, ఉమ, తరుణ్‌, తేజస్వీ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:56:35+05:30 IST