యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-07T04:43:51+05:30 IST

యాదగిరిగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం లో శనివారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి.

యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యోత్సవాలు
నిత్య పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి6: యాదగిరిగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం లో శనివారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయంలో కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు జరిపారు. కల్యాణమండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన పూజారులు ఉత్సమూర్తులను గజవాహనసేవలో తీర్చిదిద్ది నిత్యతిరుకల్యాణ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. అనుబంధ చరమూర్తుల ఆలయంలో ముక్కంటిని కొలుస్తూ అభిషేకం, బిళ్వార్చనలు శైవ సంప్రదాయరీతిలో జరిపారు. యాదాద్రీశుడిని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బి.వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డిలు వేర్వేరుగా దర్శించుకున్నారు.  

Updated Date - 2021-02-07T04:43:51+05:30 IST