పాఠశాలలను సంసిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-08-27T06:09:47+05:30 IST

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ చేసి సిద్ధంగా ఉంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు.

పాఠశాలలను సంసిద్ధం చేయాలి
డీకొత్తపల్లి హైస్కూల్‌ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు 

నాగారం/ మేళ్ల చెర్వు, ఆగస్టు 26: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ చేసి సిద్ధంగా ఉంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. నాగారం మండల పరిధిలోని డీకొత్తపల్లి హైస్కూల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే పాఠశాలలో చెత్త, చెదారం లేకుండా పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఆయనవెంట పాఠశాల హెచ్‌ఎం రమేష్‌, సర్పంచ్‌ నర్సింహారెడ్డి ఉన్నారు. అదే విధంగా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎ్‌స, అంగన్‌వాడీ కేంద్రాలు, నూతన పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొట్టె పద్మసైదేశ్వర్‌రావు, ఎంపీడీవో ఇస్సాక్‌హుస్సేన్‌, వైస్‌ ఎంపీపీ గోపిరెడ్డి, సర్పంచ్‌ శంకర్‌రెడ్డి, ఎంఈవో సైదానాయక్‌, ఈవో నారాయాణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:09:47+05:30 IST