పాఠశాలలో చోరీ: నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-21T06:13:31+05:30 IST

: భువనగిరిలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో చోరీ జరగగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పాఠశాలలో చోరీ: నిందితుడి అరెస్ట్‌

భువనగిరి టౌన్‌, అక్టోబరు 20: భువనగిరిలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో చోరీ జరగగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  పట్టణ ఎస్‌ఐ బి.వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల గేటును, తలుపును మంగళవారం రాత్రి ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగ ప్రిన్సిపాల్‌  గదిలో భద్రపర్చిన రూ.37వేలను అపహ రించాడు. కరస్పాండెంట్‌ డాక్టర్‌ రఘు వెంకటసురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా,  సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా భువనగిరిలోని   పహాడీనగర్‌కు చెందిన  డ్రైవర్‌ ఎండీ జమాల్‌ చోరీ చేసినట్లు గుర్తించి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశం మేరకు జమాల్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. 

 

 

Updated Date - 2021-10-21T06:13:31+05:30 IST