వర్గీకరణ పేరుతో దళితులను మోసం చేస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-12-31T16:05:52+05:30 IST

ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని మాల మహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేక వెంకన్న ఆరోపించారు.

వర్గీకరణ పేరుతో దళితులను మోసం చేస్తున్న కేంద్రం

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 30: ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని మాల మహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేక వెంకన్న ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో గురువారం నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వర్గీకరణ చేపట్టడానికి ముందు దళితులను రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నారు. రాజకీయ లబ్ధికోసమే రాజకీయ పార్టీలు దళితులను మోసం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు చందా దాస్‌, సంజీవ, పిట్టల బాగ్యమ్మ, కట్టా మురళీ, ప్రకాష్‌, దశరథ, పోతురాజు నాగరాజు, బీష్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:05:52+05:30 IST