హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేతమిత్ర

ABN , First Publish Date - 2021-10-19T06:01:51+05:30 IST

హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేతమిత్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పట్టణంలోని కోర్టుహాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేతమిత్ర

హుజూర్‌నగర్‌ , అక్టోబరు 18 : హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేతమిత్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పట్టణంలోని కోర్టుహాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులు కేసుల పరిష్కారానికి సహకారం అందించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతానికి తావు లేదన్నారు. న్యాయస్థానం సజావుగా సాగడానికి న్యాయవాదుల సహకారం ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి నర్సింహమూర్తి, బార్‌ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, జేఎన్‌ఆర్‌, కాలువ శ్రీను, గోపాలకృష్ణ, కృష్ణయ్య, నాగార్జున, సుందర్‌, అంజయ్య, ప్రవీణ్‌, సురేష్‌, శంకర్‌, సైదా, హుస్సేన్‌, రమణారెడ్డి, సత్యనారాయణ, రాఘవరావు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:01:51+05:30 IST