సంజయ్‌ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2021-07-12T07:00:31+05:30 IST

కేసీఆర్‌ గడీల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బండి సంజయ్‌ ఆగస్టు 9వ తేదీన చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ కోరారు.

సంజయ్‌ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగాలి
చిట్యాలలోని కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న బీజేపీ నాయకులు

 బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌
 జిల్లావ్యాప్తంగా బండి సంజయ్‌ జన్మదిన వేడుకలు
రామగిరి / కట్టంగూర్‌ / చిట్యాల / దేవరకొండ / చండూరు / చింతపల్లి, జులై 11 :
కేసీఆర్‌ గడీల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బండి సంజయ్‌ ఆగస్టు 9వ తేదీన చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ వీటీకాలనీ పంచముఖ హనుమాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, నాయకులు బొజ్జ నాగరాజు, కం కణాల నాగిరెడ్డి, రావిరాళ్ల వెంకన్న, దాసోజు యాదగిరి, నూకల వెం కన్నరెడ్డి పాల్గొన్నారు. మైనార్టీ మోర్చా నాయకుడు సయ్యద్‌ అబ్రార్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్ర ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో మోర్చా మైనార్టీ నాయకులు సయ్యద్‌  పాష, అజీ జ్‌, రెహమాన, షరీఫ్‌ పాల్గొన్నారు. కట్టంగూర్‌లో బీజేపీ కిసాన్‌ మో ర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి కేక్‌ కట్‌చేసి స్వీ ట్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాదూరి వెంకట్‌రెడ్డి, కోమటి భాస్కర్‌, హరిబాబు, అంజిబాబు, వీరే ష్‌, జితేందర్‌శర్మ, శివ, వరుణ్‌, శంకర్‌ పాల్గొన్నారు. చిట్యాలలో పార్టీ నాయకులు స్థానిక కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. బాణసంచాలు కాల్చి పండ్లు పంపీణీ చేశారు. శివనేనిగూడెం గ్రామ ంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కూరెల్ల శ్రీను, నాయకులు పొట్లపెల్లి నర్సింహ, మాస శ్రీనివాస్‌, చికిలంమెట్ల అశోక్‌, కన్నెబోయిన మహలింగం, గుండాల నరే ష్‌, పల్లె వెంకన్న, గోశిక వెంకటేశం పాల్గొన్నారు. బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు గుండాల అంజయ్యయాదవ్‌ కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ శేఖర్‌, సముద్రాల సహదేవ్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, అజయ్‌, రెడ్డిశంకర్‌ పాల్గొన్నారు. బీజేపీ బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపాటి సతీష్‌, పట్టణ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశలోని కర్నూలు జిల్లా యాగంటిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏనుగు వెంకట్‌రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కొత్త అంజిబాబు, కార్యదర్శులు మన్నెం ప్రవీణ్‌, బాలు, యువ మోర్చా అధ్యక్షుడు సోమ శంకర్‌ పాల్గొన్నారు. బండి సంజయ్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత లాలూనాయక్‌ చింతపల్లి మండల కేంద్ర ంలోని ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండలంలోని పీకేమల్లేపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివర్ల రమే్‌షయాదవ్‌, జిల్లా నాయకులు అనిల్‌రెడ్డి, బాల్‌జంగయ్యగౌడ్‌, మహే్‌షగౌడ్‌, సుమననాయక్‌, శేషుకుమార్‌, అబ్బయ్య, వెంకటేష్‌, రమేష్‌, మహేందర్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T07:00:31+05:30 IST