ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-07-08T06:29:18+05:30 IST

కేతేపల్లి మండలంలోని భీమా రం గ్రామంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా సాగుతోంది.

ఇసుక అక్రమ రవాణా
కేతేపల్లి పోలీసులు సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టర్లు

50మందిపై కేసు నమోదు.. ట్రాక్టర్ల సీజ్‌

వ్యవసాయ సీజన్లో రైతులకు ఇక్కట్లు

కేతేపల్లి, జూలై 7: కేతేపల్లి మండలంలోని భీమా రం గ్రామంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల6న ఇసుక డంపులు నిర్వహిస్తున్న 50మందిపై కేతేపల్లి పోలీసులు కేసు లు నమోదు చేశారు. కేతేపల్లి మండలంలో మూసీ నది పరివాహక ప్రాంతంలోని భీమారం గ్రామం సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడ నుంచి నిత్యం సూర్యాపేటకు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాదారుల పై పలుమార్లు పోలీసులు కేసులు పెట్టినా వారు దారికి రాకపోగా మరింత రెచ్చిపోయి ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 150కి పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. మూసీ ప్రాజెక్టు క్రమంగా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువ అవుతుండడంతో కొద్ది రోజుల్లో వరద నీటిని దిగువ కు వదిలితే ఇసుక దొరకడం కష్టమవుతుందని భావించిన ఇసుకాసురులు విచ్చలవిడిగా ఇసుక రవాణాకు దిగిన స్థానిక ట్రాక్టర్ల యజమానులు గ్రామంలో పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక రూ.2500నుంచి రూ.3వేలకు సూర్యాపేటకు తరలిస్తుండగా మూసీకి వరదలు వస్తే ఇదే ఇసుకను రూ.5000నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తుంటారు. 

అధికారులు ఎందుకు పట్టించుకోలేదు..?

ఈ క్రమంలో గ్రామంలో ఎక్కడ చూసినా ఇసు క డంపులే దర్శనమిస్తున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన చట్టసభల ప్రతినిధి ఈ గ్రామానికి చెందినవారు కావడం.. ఈయన సోదరుడు ఇక్కడ సర్పంచ్‌గా ఉండడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఇన్నాళ్లూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తాము ఆడిందే ఆట... పాడిందే పాటగా ఇసు కాసురుల వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో గ్రా మానికి చెందిన దాదాపు 20మం ది కేవలం ఇసుక రవాణాకే ట్రాక్టర్లు కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎలా సాగుతుందో అవగతమవుతుంది. ఇదిలా ఉం టే గ్రామంలో ఇసుక డంపు ల నిర్వహణపై స్థానికు లు కొందరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గ్రా మంలో దాడులు జరిపి దాదాపు 45ఇసుక డంపులను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన ఇసుక డంపులను స్థానిక తహసీల్దార్‌కు స్వాధీనం చేశారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్లు 50 కిపైగా ట్రాక్టర్లను గుర్తించిన పోలీసులు వాటిని మండల కేంద్రం కేతేపల్లిలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. ఇలా పెద్ద ఎత్తున స్టేషన్‌కు వచ్చిన ట్రాక్టర్లను పెట్టడానికి సరిపడా పార్కింగ్‌ స్థలం లేకపోవడం తో పక్కనే ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి ని తాత్కాలికంగా లీజుకు తీసుకుని అందులో ట్రా క్టర్లను వరుస క్రమంలో నిలిపారు. దీంతో ఇక్కడ ట్రాక్టర్ల జాతరను తలపిస్తోంది. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు కేతేపల్లి ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు. సదరు ట్రాక్టర్ల యజమానులతో పాటు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశామని ఆయ న చెప్పారు. మండలంలో ఎక్క డైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

వ్యవసాయ పనులకు ఇబ్బందులు

గ్రామానికి చెందిన 50కిపైగా ట్రాక్టర్లు కేసుల్లో ఇరుక్కోవడంతో స్థానిక రైతుల వ్యవసాయ పనుల కు ట్రాక్టర్లు అందుబాటులో లేకుండా పోయాయి. ప్ర స్తుతం వానాకాల సీజన్‌ వ్యవసాయ పనులు సాగుతున్న నేపథ్యంలో రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దు న్నడానికి సిధ్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన 50కి పైగా ట్రాక్టర్లు పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

Updated Date - 2021-07-08T06:29:18+05:30 IST