కమలనాథుల సాగర సమరం

ABN , First Publish Date - 2021-03-21T06:36:51+05:30 IST

సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలవడంతో బీజేపీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

కమలనాథుల సాగర సమరం

 గిరిజన తండాల్లో ప్రారంభమైన పాదయాత్ర ఫ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం
నల్లగొండ, మార్చి20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలవడంతో బీజేపీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ అభ్యర్థి ఎవరనేది తేల్చడానికి కొంత సమయం ఉండటంతో ఆశావహులందరితో కలిపి పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గంలో 2.15లక్షల ఓట్లు ఉంటే అందులో 40వేలు గిరిజనులవే కాగా అనంతరం యాదవ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఆ ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గంలోని పెద్దవూర మండలంలో శనివారం పాదయాత్ర ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలంటే కాంగ్రెస్‌ లేదా మరొకరికో ఓటు వేస్తే ప్రయోజనం ఉం డదని బీజేపీకే ఒటు వేయాలనే వాదనను ఓటర్ల మనసులో నాటితే ఆమేరకు మేం సఫలం అయినట్టే. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్లు మల్లన్న, కోదండరాంకే ఎక్కువ వేశారని దాంతో ప్రయోజనం లేదన్నారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కేసీఆర్‌ దిగొచ్చి ఎల్‌ఆర్‌ఎస్‌ ఎత్తివేయడంతో పాటు పీఆర్‌సీ ప్రకటించాడు అనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఇన్‌చార్జులు చాడ సురే్‌షరెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు టికెట్‌ ఆశావహులు, బీజేపీ సీనియర్‌ నాయకులకు ఉద్బోధ చేశారు. ఈ నెల 20నుంచి 24వరకు తండాల్లో పాదయాత్రకు ప్లాన్‌ చేశారు. పెద్దవూర మండలం జగ్రాం తండా నుంచి బీబీ తండా వర కు శనివారం పాదయాత్ర ప్రారంభించారు. 21న బాసోనితండాలో మొదలై పడమటి తండాలో 22న పడమటి తండా నుంచి మొదలై బెట్టెల తండా వరకు 23న బెట్టెలతండా నుంచి నెల్లికల్లు వరకు 24న నెల్లికల్లు నుంచి మొదలై తిమ్మాయిపాలెం వరకు సాగనుంది. ప్రతిరోజు ఉదయం 9గంటలకు పాదయాత్ర ప్రార ంభించి మధ్యాహ్న భోజనం, రాత్రి బసకు బ్రేక్‌ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళ ఆయా తం డాల్లో సభలు నిర్వహించనున్నారు. మొత్తంగా ఐదు రోజులు 75కి.మీ పూర్తిగా లం బాడా తండాల్లోను పాదయాత్ర సాగనుంది. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారయ్యాకే బీజేపీ అభ్యర్థి ఎవరనేది తేలే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2021-03-21T06:36:51+05:30 IST