సాగర్‌ ఆయకట్టు వరి సాగుకే అనుకూలం

ABN , First Publish Date - 2021-11-02T07:07:50+05:30 IST

నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధి కింద భూములు వరిపంట సాగుకు మాత్రమే అనుకూలమని, ఇతర పంటలు సాగు చేయడానికి అనుకూలం కావని సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకూబ్‌ అన్నారు.

సాగర్‌ ఆయకట్టు వరి సాగుకే అనుకూలం
గరిడేపల్లిలో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

గరిడేపల్లి, నవంబరు 1: నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధి కింద భూములు వరిపంట సాగుకు మాత్రమే అనుకూలమని, ఇతర పంటలు సాగు చేయడానికి అనుకూలం కావని సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకూబ్‌ అన్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మండల కేంద్రంలో అంబే ద్కర్‌ విగ్రహం ఎదుట సీపీఎం ఆఽధ్వర్యంలో నిరసన తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దోసపాటి బిక్షం, బాలయ్య,  పాల్గొన్నారు. 

మోతె: వరి సాగులపై ఆంక్షలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు   మట్టిపెళ్లి సైదులు డిమాండ్‌ చేశారు. తహ సీల్దార్‌ కార్యాయంలో ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అనంతర డిప్యూటీ తహసీల్దార్‌ సోమయ్యకు వినతిప్రతం అందజేశారు. 

సూర్యాపేటరూరల్‌: యాసంగి పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని సీపీఎం ఆధ్యర్యంలో సూర్యాపేట తహసీల్దార్‌  వెంకన్నకు జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి  వినతిపత్రం అందజేశారు


Updated Date - 2021-11-02T07:07:50+05:30 IST