ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం

ABN , First Publish Date - 2021-08-27T06:31:18+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని రీజనల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదరహిత వారోత్సవాలను ఆయ న గురువారం ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి స్థాని క జ్యోతి ఆస్పత్రిలో రక్తదానం చేశారు.

ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
జ్యోతి ఆస్పత్రిలో రక్తదానం చేస్తున్న రీజనల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌

ఆర్‌ఎం రాజేంద్రప్రసాద్‌ 

జ్యోతి ఆస్పత్రిలో రక్తదాన శిబిరం


మిర్యాలగూడ(అర్బన్‌), మిర్యాలగూడటౌన్‌ ఆగస్టు 26: ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని రీజనల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదరహిత వారోత్సవాలను ఆయ న గురువారం ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి స్థాని క జ్యోతి ఆస్పత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ లక్ష్య మన్నారు. సుశిక్షితులైన సిబ్బంది సరై న సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో ముందు వరసలో ఉన్నారన్నారు. ప్రజలకు మ రింతగా సేవలు అందించేందుకు కార్గోను విస్తరిస్తున్నామన్నారు. అనం త రం డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆర్టీసీ సిబ్బంది రహదారి నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రమాదరహిత సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అత్యవసర సమయాల్లో రోగులు రక్తం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తకుండా, ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ పాల్‌, డీవీఎంలు శ్యామల, కేశవులు, డీఎంలు రామచంద్రమూర్తి, కృపాకర్‌రెడ్డి, పాల్‌, ఏడీఎం నాగశ్రీ, వెల్‌ఫేయిర్‌ మెంబర్‌ స్వాతి, జాన్సీ, ఆర్టీసీ సీఐ సంధ్య, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐ సదా నాగరాజు, రమేష్‌, జ్యోతి ఆస్పత్రి వైద్యులు మువ్వా రామారావు, డాక్టర్‌ మువ్వా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లను ఆయన సన్మానించారు.

Updated Date - 2021-08-27T06:31:18+05:30 IST